top of page

యాత్ర సమయములో పాటించవలసిన నియమ నిష్ఠలు

 1. తీర్థయాత్ర అన్నది విహార యాత్ర కాదు అందువలన కొద్దిపాటి తపస్య చేయుటకు సంసిద్ధంగా ఉండవలెను.

 2. భక్తులు యాత్ర సమయములో మాంసాహారము భుజించకుండుట, ధూమపానము, మధ్యపానము సేవించకుండుట మొదలగు నియమములు ఖచ్చితముగా పాటించవలెను.

 3. యాత్ర సమయములో తప్పని సరిగా కనీసం ఎనిమిది మాలలు జపించవలెను.

 4. భక్తులు నిర్వాహకుల సూచనలను శ్రద్ధతో విని పాటించవలెను.

 5. భక్తులు సమయపాలనను పాటించవలెను. ఒక్కరి కారణంగా మొత్తం యాత్రికులు అందరూ ఇబ్బంది పాలు అవకుండా జాగ్రత్త పడవలెను.

 6. సమయ పాలనను పాటించినచో, ఎక్కువ స్థలాలను దర్శించుకొనవచ్చు, లేని పక్షమున కొన్ని ప్రదేశములను మాత్రమే దర్శించుకొనడం జరుగుతుంది.

 7. భక్తులు ఎక్కడికైన వెళ్ళదలచినచో నిర్వాహకులకు తెలియపరచి వెళ్ళవలెను.

 8. ఇతర భక్తులకు సహాయము చేయుటను ముఖ్య ఆచరణగా పెట్టుకొనవలెను.

 9. మనము భగవంతున్ని దర్శించుకొని అతని కరుణా కటాక్షములను పొందుటకు వచ్చామన్న విషయమును మనస్సులో పెట్టుకొని, అనవసరపు మాటలు, తగాదాలు, నింద ప్రతి నిందలు చేసుకోకుండా నియంత్రించుకొనవలెను.

 10. దర్శనమునకు వెళ్ళునప్పుడు, మిగతా అవసరమయిన చోట్ల వరుస క్రమమును పాటించవలెను.

 11. వరిష్ట భక్తులకు, మహిళలకు ప్రాధన్యత ఇవ్వవలెను.

 12. తల్లిదండ్రులు తమ పిల్లలపై ద్యాస ఉంచవలెను. ప్రవచనముల సమయములో పిల్లలను నియంత్రణలో ఉంచగలరని ఆశిస్తున్నాము.

 13. నిర్వాకులకు తెలియకుండా అపరిచయులను యాత్రకు ఆహ్వానించవద్దు.

 14. “భక్తుల సేవయే నా సేవ” అన్నాడు కృష్ణుడు. అందుచేత యాత్ర సమయములో ఇతర భక్తులకు సేవ చేసి భగవత్ కృపను పొందుటకు సిద్ధంగా ఉండండి.

 15. యాత్ర సక్రమముగా జరుగుటకు నిర్వాహకులు అన్ని విధాలుగా మీ సహకారాన్ని ఆశిస్తున్నారు.

bottom of page